భారతదేశం, జూలై 9 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో గౌతమ్ ఇంట్లో ఏం జరిగింది అని కార్తీక్ ను అడుగుతుంది దీప. జ్యోత్స్న ఒంటరిగా వచ్చిందనుకుని గౌతమ్ చేయి పట్టుకున్నాడు. బయటి నుంచి చూశాను. కాసేపు ఆగి ఉంటే జ్యోత్స్ననే చెప్పు తీసుకునే కొట్టేది. కానీ ఎంగేజ్మెంట్ ఆగిపోయేది. అయితే గౌతమ్ కాళ్లు పట్టుకునైనా ఎంగేజ్మెంట్ చేసుకునేవాడు అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు బుద్ధి లేదు అని దీప అంటే.. వేరే దారి లేదు అని కార్తీక్ చెప్తాడు.

మామయ్యకు జ్యోత్స్న గురించి తెలుసు. దాసు మామయ్యను చంపబోయింది జ్యోత్స్న అని మీ నాన్నకు తెలుసు అని కార్తీక్ చెప్పగానే దీప షాక్ అవుతుంది. నీకు ఎలా తెలుసు అంటే మామయ్యే చెప్పారని, నేను ఇంకా ఏం చెప్పలేదని కార్తీక్ అంటాడు. దాసు మామయ్యకు గతం గుర్తొస్తే నిజాలు తెలుసుకుని మామయ్య జ్యోత్స్ను ఏమైనా చేస్తాడు అని కార్తీక్ చెప్తాడు. ...