Hyderabad, జూన్ 14 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను కార్తీక్ మరదలా అని పిలుస్తాడు. మీరు ఇలా పిలుస్తుంటే నాకు ఒకలా పిలవాలని ఉందని దీప అంటుంది. ఇలా పిలవాలని ఉందని మల్లెపూలతో బావ అని రాస్తుంది దీప. నేను నీ సొంత మేనత్త కొడుకుని, నీ బావని. నాకు పిలిపించుకోవాలని ఉన్నప్పుడు ఎందుకు ఆపడం. మనసారా వింటాను అని కార్తీక్ అంటాడు.

దాంతో మెల్లిగా సిగ్గు పడుతూ బావ అని కార్తీక్‌ను దీప పిలుస్తుంది. మరోసారి పిలిపించుకుంటాడు. దాంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. జ్యోత్స ఎన్నోసార్లు పిలిచిన చెవికి మాత్రమే తగిలేది నువ్ పిలుస్తుంటే మనసుకు తగులుతుంది. ఇలాగే పిలు. వినడానికి చాలా బాగుంది అని కార్తీక్ అంటాడు. ఈ బావకు మాటిస్తావా మరదలా. కోనేటీలో కలిసినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. మనం పేరుకే పెద్దలం కానీ చిన్నపిల్లల్లా ఉందాం అని కార్తీక్ అంటాడు.

నువ్ ఎల...