భారతదేశం, ఫిబ్రవరి 2 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న తప్పించుకోవడం గురించి దీపకు చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నను మళ్లీ టెస్ట్‌లు చేయించాలని మావయ్య అనుకుంటున్నాడని కార్తీక్ చెబుతాడు. ఈసారి మనం చెప్పకుండానే అందరికి తెలుస్తుంది అని దీప అంటుంది.

జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావు. నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావ్ కాబట్టి నువ్వే కాపాడుతావ్. దాసు మావయ్య నిజం చెప్పడానికి రాడు. జ్యోత్స్న మావయ్యను దాచినట్లు అనిపిస్తుంది. ఇక నువ్వు చీకటి పరదా దాటి రావాల్సిందే. ఇదే లాస్ట్ రౌండ్ అని కార్తీక్ అంటాడు. మరోవైపు దాసుతో జ్యోత్స్న కాల్ మాట్లాడుతుంది.

ఈసారి నేను నీకు కథ చెబుతాను. భయం అవుతుంది నాన్న. నాకోసం ఏం చేయవా నాన్న. అందరం కలిసి ఉందాం నాన్న అని జ్యోత్స్న అంటే దాసు సెటైర్లు వేస్తాడు. నీలాంటి తండ్రికి ఆ నరకంలో కూడా చోటు దొరకదు. నీకు ఫోన్...