భారతదేశం, జూలై 21 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకునేందుకు జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అనే న్యూస్ విని జ్యోత్స్న ఇంత ట్విస్ట్ ఇచ్చావ్ అనుకుంటారు అని మనసులో అనుకుంటుంది జ్యో. కారు రైట్ కు తిప్పి శ్రీశైలం వెళ్దామనుకుంటుంది. కానీ ఇంతలో కారు ఎందుకు మేడం రైట్ కు తిప్పారు? అనే కార్తీక్ వాయిస్ వినగానే షాక్ అవుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీప కార్లోనే పడుకుంటారు. పెద్ద సారు ఇంట్లో ఉండద్దొన్నారు, బయట చలిగా ఉందని కార్లో పడుకున్నామని కార్తీక్ చెప్తాడు.

మీరెందుకు ఈ టైమ్ లో బయటకు వచ్చారు? అబద్దాలు ఎందుకు చెబుతున్నారంటూ కార్తీక్, దీప అడుగుతారు. నాకు పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా చేశావని అనుకుంటుంది జ్యోత్స్న. పెద్ద సారుకు ఫోన్ చేద్దామని కార్తీక్ అనగానే ఆగు బావా అని కారు...