భారతదేశం, జనవరి 31 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాంచన నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని, కానీ, కొడుకుగా కలిసి ఉండాలని కోరుకుంటాను అని కార్తీక్ చెబుతాడు. ఆరోగ్యం బాలేనప్పుడు నాన్‌వెజ్ తినడం మానేసింది ఉదాహరణగా చెప్పి నిర్ణయాలు తీసుకునేది పాటించడానికే అని, కేవలం మిమ్మల్ని పిలిచింది కాశీ, స్వప్నలను కలపడానికి అని కాంచన అంటుంది.

స్వప్న నాకు పుట్టకపోయిన నా కూతురు లాంటిదే. కాశీతో స్వప్నను కలపాలి. కాశీ ఇక్కడే ఉంటాడు అని కాంచన చెబుతుంది. శ్రీధర్ వెళ్తానంటే కాశీ ఇక్కడ ఉన్నట్లు స్వప్నకు చెప్పకండని కాంచన అంటుంది. వంట చేసి కాశీకి అన్నం పెట్టు, స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు అని దీపతో అంటాడు కార్తీక్. బావ అని కాశీ అంటే తర్వాత మాట్లాడదామని కార్తీక్ అంటాడు.

దీప చేతికి బ్యాండేజ్ చూసిన కాంచన నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది. సుమిత్ర క...