భారతదేశం, సెప్టెంబర్ 3 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో తాళి కనిపించక మండపంలో అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావురా అని కాంచన అడిగితే, ఇంటి పరువు కోసమని చెప్తాడు కార్తీక్. పరువు నీకేనా? వాళ్లకు లేదా? వాళ్లు ఆలోచించరా? పెళ్లి నా పుట్టింట్లో. జరిపించేది మా నాన్న. వదినకు మామగారు. పెళ్లి ఆగిపోతే ఎవరికి చెడ్డపేరు? ఎదుటి వాళ్లు చిన్న తప్పు చేస్తే వెలి వేస్తారు. మా వదిన బుద్ధి ఇంత గడ్డి తింటుందని అనుకోలేదని కాంచన అంటుంది.

అత్తయ్య ఇప్పుడు ఎందుకు మా అమ్మను తిడుతున్నారు. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. కానీ పెళ్లి జరిగింది కదా అని దీప అంటుంది. కన్యాదానం చేశారని మా అన్నయ్య, వదిన నీకు సొంత అమ్మనాన్న అయిపోయారని అనుకుంటున్నావా? ఆ పిలుపు, బంధం ఆ ఇంటి గడప దాటేవారకే. వాళ్లకు, నీకు ఏ బంధం ఉండాల్సిన అవసరం లేదు. మా వదిన లాంటి తల్లి...