భారతదేశం, ఫిబ్రవరి 3 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో హాస్పిటల్ కు వచ్చిన దశరథ, శివ నారాయణ, జ్యోత్స్న అక్కడ కార్తీక్, దీపను చూస్తారు. వీళ్లు టెస్టులకు వచ్చారని నాకు తెలియదు జ్యోత్స్న. నీతో రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను. దీనికి కార్తీక్ కు ఏ సంబంధం లేదని దశరథ చెప్తాడు.

దీపను డాక్టర్ కు చూపిద్దామని తీసుకొచ్చానని కార్తీక్ అబద్దం చెప్తాడు. అప్పుడు మీరు గైనకాలిజిస్ట్ దగ్గర ఉండాలి కానీ డాక్టర్ హారిక రూమ్ నుంచి ఎందుకు వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్రమ్మ గురించి అడుగుదామని వచ్చామని దీప చెప్తుంది. సాయం చేయగలిగే స్థితిలో ఉండి, సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే అంతకుమించిన బాధ ఉండదని కార్తీక్ ఫీల్ అవుతాడు.

ఈ సారి అలా జరగదు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు పక్కనే ఉంటానని శివనారాయణ అంటాడు. ఎలా తప్పిం...