భారతదేశం, మే 3 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 3) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కాశీ మెసేజ్ చేయడంతో దాసు ఇంటికి వెళుతుంది పారిజాతం. ఇంటికి రమ్మని అడిగితే దాసుకు గతం గుర్తొచ్చిందేమో అనుకున్నానని పారు అంటుంది. నాకేమైంది.. అంతా గుర్తుందని అంటాడు దాసు. ఎవరో నిన్ను కొట్టి రోడ్డు మీడ పడేస్తే.. డాక్టర్ ఆసుపత్రిలో చేర్పించారని పారిజాతం అంటుంది. ఆయనే ట్రీట్‍మెంట్ చేస్తున్నారని చెబుతుంది. ఎవరు కొట్టారో గుర్తుందా అని దాసును పారిజాతం అడుగుతుంది.

నిన్ను కొట్టింది ఎవరో గుర్తు తెచ్చుకో అని మళ్లీ దాసును అడుగుతుంది పారిజాతం. గుర్తు రావడం లేదని చెబుతున్నా కదా అని దాసు చిరాకు పడతాడు. నాన్నను ఇబ్బంది పెట్టొద్దని కాశీ అంటాడు. మీకు నాపై ప్రేమ ఉందా అంటే.. మీకుంటే మాకు ఏడుస్తుందని స్వప్న కౌంటర్ వేస్తుంది. అలా అనొద్దని కాశీ చెబుతాడు. అక్కడి నుంచి దాసు లేచి వెళ్ల...