భారతదేశం, ఫిబ్రవరి 1 -- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సారి తండ్రయ్యారు. ఈ సారి అతని హ్యాపీనెస్ డబుల్ అయింది. ఎందుకంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక పాప, ఒక బాబు పుట్టారు. ఈ విషయాన్ని మొదట మెగాస్టార్ చిరంజీవి కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ట్విన్స్ కు తండ్రిగా రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్ వైరల్ గా మారింది.

రామ్ చరణ్, ఉపాసన దంపుతులకు కవలలు పుట్టారు. ఒక బాబు, ఒక పాప వీళ్ల జీవితాల్లోకి వచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రౌడ్ తాతయ్య చిరంజీవి అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ ఇన్ స్టాలో ఉపాసన కడుపుతో ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోతో తన రియాక్షన్ పోస్టు చేశారు.

''మాకు ఆశీర్వాదంగా బేబీ బాయ్, గర్ల్ వచ్చారని చెప్పేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకును కలిగి ఉండటం మమ్మల్ని కృత‌జ్ఞ‌తాభావ...