భారతదేశం, ఫిబ్రవరి 3 -- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి 2898 ఏడీ'. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ మైవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ మొదటి భాగం రూ. 1042 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి దీని సీక్వెల్ పైనే ఉంది. అయితే నిర్మాతలు సీక్వెల్ గురించి మౌనం వహిస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మార్పు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

గతేడాది సెప్టెంబర్ లో దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు బలంగా వినిపించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాతో పాటు, 'కల్కి' సీక్వెల్ నుంచి కూడా ఆమె వైదొలిగింది. రెమ్యునరేషన్ పెంపు వ...