Hyderabad, ఆగస్టు 13 -- కన్నడ నుంచి ఆ మధ్య తొలి వెబ్ సిరీస్ తీసుకొచ్చిన జీ5 ఓటీటీ ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు శోధ (Shodha). అయ్యన మణితో సక్సెస్ సాధించిన ఆ ఓటీటీ తాజాగా ఈ కొత్త సిరీస్ ట్రైలర్ ను బుధవారం (ఆగస్టు 14) రిలీజ్ చేసింది.

జీ5 ఓటీటీలో తీసుకొస్తున్న సరికొత్త కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శోధ. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఓ ప్రమాదంలో తన గతాన్ని మరచిపోయే రోహిత్ (పవన్ కుమార్) వ్యక్తి.. అది గుర్తుకు వచ్చిన తర్వాత తన భార్య మీరా (సిరి రవికుమార్)ను తప్ప మిగిలిన అందరినీ గుర్తుపడతాడు. తన భార్య మిస్ అయిందంటూ పోలీస్ స్టేషన్ లోనూ కేసు పెడతాడు.

చివరికి తన కూతురిని కూడా తల్లి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటాడు. అసలు అతడు ఎందుకలా చేస్తాడు? ఇందులో రోహిత్ తప్పు ఉందా లేక మీ...