భారతదేశం, ఏప్రిల్ 16 -- SC on HCU Lands: అభివృద్ధి పేరుతో అడవుల్ని నరికి వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కంచ గచ్చబౌలి భూముల్లోచెట్లు నరికి వేతపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని అవి అటవీ భూములు కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏప్రిల్ 16లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని గతంలో ఆదేశించింది. కంచ గచ్చిబౌలిలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తరపున సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

గురువారం జరిగిన విచారణలో ప్రభ...