భారతదేశం, మే 15 -- కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు పని చేయని రోజుల్లో పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించింది. లాంగ్‌ వీక్‌ ఎండ్‌లో ఎందుకు చెట్లను నరికి వేశారని నిలదీసింది.

కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణానికి జరిగిని నష్టాన్ని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో తేల్చాలని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీజే బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఎలాంటి పనులు చేపట్టడం లేదని, పర్యావరణ పునరుద్దరణ పనులు మినహా ఏమి చేయడం లేదని వివరణ ఇచ్చింది. చెట్లు నరికి వేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులక...