భారతదేశం, ఫిబ్రవరి 5 -- దేశవ్యాప్తంగా ట్యాక్సీ సేవలను వినియోగించే ప్రయాణికులకు, వాహనాలను నడిపే డ్రైవర్లకు తీపి కబురు. దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ 'భారత్ టాక్సీ' (Bharat Taxi) గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. గత రెండు నెలలుగా దిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.

మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్-2002 కింద నమోదైన ఈ ప్లాట్‌ఫామ్, ప్రపంచంలోనే అతిపెద్ద డ్రైవర్ల యాజమాన్యంలోని మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సృష్టించింది. ఓలా, ఉబెర్, రాపిడో వంటి కార్పొరేట్ సంస్థలకు దీటుగా, డ్రైవర్ల శ్రమకు తగిన విలువనిచ్చే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.

సాధారణ యాప్‌లకు భిన్నంగా భారత...