Hyderabad, మే 7 -- ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్: ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. బడ్జెట్ లో కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఓదెల 2 డిజిటల్ ప్రీమియర్ కానుంది.

తమన్నా భాటియా నటించిన ఓదెల 2 మూవీ గురువారం (మే 8) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓదెల 2 స్ట్రీమింగ్ కాబోతోంది.

ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు.

తమన్నా భ...