Hyderabad, అక్టోబర్ 8 -- రెండు దశాబ్దాలకుపైగా మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్న మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్. ఈ సింగింగ్ షో 16వ సీజన్ రాబోతోంది. ప్రతి ఏటా సరికొత్త సింగింగ్ టాలెంట్ ను అందిస్తున్న ఈ షో కొత్త సీజన్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. శ్రేయా ఘోషాల్ తోపాటు విశాల్ దద్లానీ, బాద్‌షా మరోసారి జడ్జీలుగా తిరిగి వస్తున్నారు.

ఇండియన్ ఐడల్ సీజన్ 16 స్ట్రీమింగ్ తేదీని సోనీ లివ్ ఓటీటీ, సోనీ టీవీ అనౌన్స్ చేశాయి. ఈ సరికొత్త సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. సీజన్ 16 జడ్జ్‌ల ప్యానెల్‌లో కంపోజర్-సింగర్ విశాల్ దద్లానీ, ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్, రాపర్ బాద్‌షా ఉంటారు.

నిజానికి ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో విశాల్ ప్రకటించినా.. ఈ సీజన్ కు మళ్లీ తిరిగి వచ్చాడు. ఆరు సీజన్...