భారతదేశం, మే 17 -- ఓటీటీల్లో కొత్తగా తెలుగులో సినిమాలు చూడాలనుకునే వారికి.. ఈ వారం మరిన్ని నయా చిత్రాలు వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తెలుగులో నాలుగు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. కల్యాణ్ రామ్ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. రెండు తెలుగు డబ్బింగ్‍‍లో అందుబాటులోకి వచ్చాయి. ఈవారం ఓటీటీలో తెలుగులో వచ్చిన నాలుగు సినిమాల వివరాలివే..

తెలుగు యాక్షన్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ శుక్రవారం మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి మరో ముఖ్యమైన పాత్ర చేశారు. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్‍తో సాగే ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ మ...