భారతదేశం, జూన్ 9 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ శుక్రవారం (జూన్ 13) సూపర్ రిలీజ్‍లు ఉండనున్నాయి. ఆ రోజు రానున్న మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ సీక్వెల్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్‍కు రెండో సీజన్ ఆ రోజునే రానుంది. శుభం చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఓ మలయాళ చిత్రంతో మరో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ శుక్రవారం ఒక్క రోజే రానున్న ఆ టాప్-4 రిలీజ్‍లు ఇవే..

తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం జూన్ 13న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీని స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతోనే నిర్మాతగా ఆమె మారారు. ఈ లోబడ్జెట్ చిత్రం మే 9వ తేదీన థియేటర్లలో విడుదలై ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ...