భారతదేశం, మే 12 -- గతవారం ఓదెల 2, రాబిన్‍హుడ్, జాక్, గుడ్‍ బ్యాడ్ అగ్లీ ఇలా పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మే మూడో వారం (మే 12-18)లోనూ కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. సుమంత్ నటించిన ఈ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. బాసిల్ జోసెఫ్ నటించిన బ్లాక్‍బస్టర్ తెలుగులోనూ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 చిత్రాలు ఇవే.

అక్కినేని సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన అనగనగా చిత్రం మే 15వ తేదీన ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోకే ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీలో ఉపాధ్యాయుడిగా సుమంత్ నటించారు. ఆయనకు జోడీగా కాజల్ చౌదరి చేశారు. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యా వ్యవస్థపై సెటైరిక...