భారతదేశం, జూన్ 7 -- ఓటీటీల్లో కొత్తగా తెలుగు సినిమాలు చూడాలనుకుంటే ఈ జూన్ తొలి వారంలో కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. శ్రీవిష్ణు బ్లాక్‍బస్టర్ మూవీ సింగిల్ ఈ వారమే అడుగుపెట్టింది. మరో రెండు కామెడీ సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బాలీవుడ్ మూవీ జాట్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు సినిమాలు ఇవే..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన సింగిల్ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 6) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మే 9వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రూ.14కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను దక్కించుకొన...