భారతదేశం, ఏప్రిల్ 28 -- హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం నొస్‍ఫెరటు (Nosferatu) సూపర్ హిట్ సాధించింది. రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వం వహించిన ఈ గోథిక్ హారర్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కొట్టింది. లిలీ రోజ్ డెప్, బిల్ స్కార్స్ గార్డ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2024 డిసెంబర్ 24న విడుదలైంది. కొన్ని ఓటీటీల్లో ఇప్పటికే రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ఇప్పుడు సిద్ధమైంది.

నొస్‍ఫెరటు సినిమా మే 10వ తేదీన జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెంట్ చెల్లించి చూసేలా అందుబాటులోకి వచ్చింది. అయితే, హాట్‍స్టార్ ఓటీటీలో రెంట్ లేకుండా చేసేలా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు మే 10న అడుగుపెట్టనుంది. దీంతో జియో హాట్‍స్టార్ సబ్...