Hyderabad, అక్టోబర్ 3 -- బ్లాక్‌బస్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ థియేటర్లలోనే కాదు.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.40 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో మరిన్ని రికార్డులు తిరగరాస్తోంది.

మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా అక్టోబర్ 1న ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్ల కంటే అదనపు రన్ టైమ్ తో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది.

తొలి రెండు రోజుల్లోనే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ 50 మిలియన్లు అంటే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

లిటిల్ హార్ట్స్ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు అనుష్క ఘ...