భారతదేశం, మే 13 -- సిబి సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన టెన్ హవర్స్ సినిమా ఏప్రిల్ 18న విడుదలైంది. థియేట్రికల్ రన్‍లో ఈ తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పెద్దగా కలెక్షన్లు దక్కలేదు. కిడ్నాప్, మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఇళయరాజా కలియపెరుమాల్. థియేటర్లలో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయిన టెన్ హవర్స్ ఓటీటీలో సత్తాచాటుతోంది.

టెన్ హవర్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో గత వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాకు క్రమంగా వ్యూస్ పెరుగుతున్నాయి. స్ట్రీమింగ్ తర్వాత రెస్పాన్స్ బాగుండటంతో ఆదరణ దక్కుతోంది. దీంతో ఈ మూవీ నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో మూడో స్థానానికి దూసుకొచ్చేసింది. కొన్ని పెద్ద సినిమాలను దాటుకొని ట్రెండింగ్‍లో ఎగబాకింది.

రూ.5కోట్లలోపు బడ్జెట్‍తోనే టెన్ హవర్స్ చిత్రం ...