Hyderabad, జూన్ 2 -- ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మే 26 నుంచి జూన్ 1తో ముగిసిన వారానికిగాను ఈ లిస్ట్ వచ్చేసింది. టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. అంతేకాదు వాటికి వచ్చిన వ్యూస్ వివరాలను కూడా తెలిపింది.

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో రెండు మలయాళం, ఒకటి తెలుగు, రెండు హిందీ మూవీస్ చోటు దక్కించుకున్నాయి. వీటిని కేవలం ఇండియన్ ఆడియెన్స్, కనీసం అరగంట పాటు చూసిన వ్యూస్ ఆధారంగా రూపొందించారు. వీటిలో తొలి స్థానంలో ఉన్నది మాత్రం మలయాళం రివేంజ్ థ్రిల్లర్ తుడరుమ్ (Thudarum). ఈ సినిమాకు గత వారం 2.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో తెలుగుతోపాటు మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోం...