Hyderabad, అక్టోబర్ 8 -- అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. ఈ మూవీ అక్టోబర్ 17న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే దాని కంటే ముందు ఈ ఇద్దరే కలిసి నటించిన రాక్షసుడు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ రాక్షసుడు. 2019లో థియేటర్లలో రిలీజైంది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అప్పట్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 'రాక్షసుడు' సినిమా శ్రీనివాస్ కెరీర్‌లోని మొదటి ప్రధాన హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అతన్ని ఇంటింటికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా విజయం అనుపమ పరమేశ్వరన్‌కు కూడా తెలుగు సినిమాలో మంచి స్థానాన్ని పదిలం చేసింది.

ఇప్పుడు ఈ సినిమా మళ్లీ వార్తల్లో ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చల...