Hyderabad, జూన్ 16 -- ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు కూడా ఓటీటీలో ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తున్నాయి. తాజాగా నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దారుణంగా బోల్తా పడింది. అయితే జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వరుసగా స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులను తిరగరాస్తూ వెళ్తోంది.

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాబిన్‌హుడ్. భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైనా.. అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చివరికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.

అయితే ఈ యాక్షన్ కామెడీ మూవీ జీ5 ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. నిజానికి ఇది అ...