భారతదేశం, మే 3 -- బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్ర పోషించిన కాస్తవ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. 1990ల్లో గోవాలో కస్టమ్స్ అధికారిగా పని చేసిన కాస్తవ్ ఫెర్నాండెజ్ జీవితంలోని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి సేజల్ షా దర్శకత్వం వహించారు. ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా సినిమా కాస్తవ్ స్ట్రీమింగ్‍లో ప్రస్తుతం అదరగొడుతోంది.

కాస్తవ్ చిత్రం మే 1వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీకి మొదటి నుంచి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ప్రస్తుతం (మే 3) ఈ చిత్రం జీ5లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది.

కాస్తవ్ చిత్రం జీ5 ఓటీటీలో హిందీలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. డబ్బింగ్‍లో ...