Hyderabad, జూన్ 17 -- స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా శుభం. ఆడవాళ్లకు ఉండే సీరియల్స్ పిచ్చి ఆధారంగా రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.

మే 9న థియేటర్లలో రిలీజైన మూవీ శుభం.. నెల రోజుల తర్వాత జూన్ 13 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే 150 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు ఆ ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. అసలు పెద్దగా స్టార్లు ఎవరూ లేకుండా, చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ మామూలు విషయం కాదు.

థియేటర్లలోనూ బాక్సాఫీస్ దగ్గర మూవీ లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఊహించినట్లే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ...