Hyderabad, జూలై 19 -- ప్రేమ కథలు ఎప్పుడూ ఆదరణ పొందే జానర్. కాలంతో పాటు దీనికి థ్రిల్లింగ్ అంశాలు కూడా జోడించి కొత్తగా చూపించడం మనం చూస్తున్నాం. ప్రస్తుత ట్రెండ్‌లు, యువత ఆలోచనలకు తగ్గట్టుగా చాలా ప్రేమ కథలు వస్తున్నప్పటికీ, రొమాంటిక్ థ్రిల్లర్ అనే సబ్‌-జానర్ తమిళ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వీటిలో కొన్ని కల్ట్ క్లాసిక్‌లుగా నిలిచాయి. కొన్ని మరపురాని పాత్రలను కూడా అందించాయి. వీటిలో ఐదు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ సన్ నెక్ట్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

2005లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజిని' ఒక తమిళ రొమాంటిక్ థ్రిల్లర్. ఇందులో సూర్య, అసిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాధపడే ఓ వ్యాపారవేత్త తన ప్రేమికురాలి మరణానికి కారణమైన వారిని వేటాడటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది...