భారతదేశం, ఏప్రిల్ 21 -- కిషన్ దాస్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో తరుణం మూవీ రూపొందింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. తరుణం మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. డేట్

తరుణం సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన టెంట్‍కొట్ట (Tentkotta) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (ఏప్రిల్ 21) అధికారికంగా వెల్లడించింది. "థ్రిల్స్, రొమాన్స్, ఊహించని ట్విస్టులు. ఎమోషన్ల కలబోతతో ఉండే తరుణం చిత్రం ఏప్రిల్ 25న టెంట్‍కొట్టలోకి వచ్చేస్తోంది" అని సోషల్ మీడియాలో ఆ ఓటీటీ పోస్ట్ చేసింది.

తరుణం చిత్రం థియేటర్లలో విడుదలైన సుమారు 80 రోజుల తర్వాత టెంట్‍...