భారతదేశం, ఫిబ్రవరి 3 -- బాస్ ఈజ్ కమింగ్.. ఓటీలోకి మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకరవరప్రసాద్ గారు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వెల్లడించకపోయినా.. కమింగ్ సూన్ అంటూ జీ5 ఓటీటీ ఓ అదిరిపోయే వీడియోను మంగళవారం (ఫిబ్రవరి 3) రిలీజ్ చేసింది. అయితే ఫిబ్రవరి 11 నుంచి సినిమా స్ట్రీమింగ్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకూ వసూలు చేసిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. జీ5 ఓటీటీ రిలీజ్ చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.

"మన శంకరవరప్రసాద్ గారు. ది బాస్, ది మెగాస్టార్. జీ5లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చూస్తూనే ఉండండి" అనే క్యాప్షన్ తో వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో చిరంజీవి, నయనతార...