భారతదేశం, మే 10 -- కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం 'బయలుసీమే' 2023 ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. వరుణ్ కట్టిమణి, టీఎస్ నాగాభరణ, రవిశంకర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. లీడ్ రోల్ చేసిన వరుణ్ కట్టిమణినే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఓటీటీలోకి చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు చాలా లేట్‍గా ఇప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చింది.

బయలుసీమే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, రెంటల్ విధానంగా ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రైమ్ వీడియోలో రూ.99 రెంట్ చెల్లించి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

థియేటర్లలో రిలీజైన 21 నెలలకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి బయలుసీమే మూవీ వచ్చింది. ఓటీటీ డీల్ జరగపోవటం కారణంగా ఇంత కాలం స్ట్రీమింగ్‍కు రాలేదు. ఇప్పుడు కూడా రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ...