Hyderabad, జూన్ 2 -- థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత చాలా వరకు సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు 20 రోజుల్లోనే వస్తున్నాయి. అయితే ఇప్పుడో రొమాంటిక్ కామెడీ మాత్రం 15 రోజుల్లోనే వస్తుండటం విశేషం. నిజానికి మొదట్లో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చారు. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ కూడా సాధించింది.

రొమాంటిక్ కామెడీ మూవీ భూల్ చుక్ మాఫ్ (Bhool Chuk Maaf) మే 23న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన ఈ సినిమా జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అంటే కేవలం రెండు వారాల్లోనే వస్తోంది.

ఇప్పటికీ ఇంకా థియేటర్లలో ఆడుతోంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర రూ.75 కోట్లకుపైగా వసూలు చేసింది. అయినా మేకర్స్ మాత్రం మూవీని ఓటీటీ రిలీజ్ చేస...