Hyderabad, జూలై 2 -- మలయాళంలో వచ్చిన డ్యాన్స్ సినిమా 'మూన్‌వాక్' డిజిటల్ ప్రీమియర్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది మే 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించడం చూస్తే.. ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతబాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఏంటో చూడండి.

మలయాళం ఇండస్ట్రీ నుంచి డ్యాన్స్ పై వచ్చిన మూవీ మూన్‌వాక్. అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, మనోజ్ మోసెస్, నైనిత మరియా, సుజిత్ ప్రభాకర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్య సూపర్ హిట్ మలయాళం సినిమాల హక్కులను వరుసగా సొంతం చేసుకుంటున్న ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు మూన్‌వాక్ మూవీనీ స్ట్రీమింగ్ చేయనుంద...