Hyderabad, సెప్టెంబర్ 29 -- కిష్కింధపురి.. లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ. పెద్దగా అంచనాలు లేకుండా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే రోజు మిరాయ్ కూడా రిలీజైనా ఆ ధాటిని తట్టుకొని నిలబడింది. ఇప్పుడీ సినిమా అక్టోబర్ లో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలు వచ్చాయి. అంతేకాదు ఓటీటీ డీల్ తోనూ మేకర్స్ బాగానే వెనకేసుకున్నట్లు సమాచారం. భారీ మొత్తానికి జీ5 ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన...