భారతదేశం, మే 5 -- స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మంచి హైప్ మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ స్పై యాక్షన్ కామెడీ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ జాక్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది.
జాక్ సినిమా మే 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషల్లో వస్తోంది.
జాక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‍ను నెట్‍ఫ్లిక్స్ నేడు (మే 5) అధికారికంగా ప్రకటించింది. "పాబ్లో నెరూడా.. పేరు పొయిటిక్‍గా ఉన్నా ప్రొఫెషన్ మాత్రం కాన్ఫిడెన్షియల్. జాక్ చిత్రాన్ని మే 8 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.