భారతదేశం, ఏప్రిల్ 29 -- నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీ సెల్సియస్ (28 Degree Celsius) చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్ ద్వారా ఈ మూవీ బాగానే ఆసక్తిని రేపింది. అయితే, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లు రాలేదు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి అనిల్ విశ్వంత్ దర్శకత్వం వహించారు. ఈ 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఇప్పుడు సడెన్‍గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

28 డిగ్రీ సెల్సియస్ చిత్రం నేడు (ఏప్రిల్ 29) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తుగా ప్రకటన చేయకుండా సడెన్‍గా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ప్రస్తుతం ఈ మూవీ తెలుగులో ఒక్కటే అందుబాటులోకి వచ్చింది.

థియేటర్లలో రిలీజై నాలుగు వారాలు దాటకముందే ప్రైమ్ వీడియోలో అడుగుపె...