భారతదేశం, ఏప్రిల్ 28 -- బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించిన 'ది డిప్లమాట్' చిత్రం ఈ ఏడాది మార్చి 14వ తేదీన విడుదలైంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీకి శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. భారత దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ది డిప్లమాట్ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ సిద్ధమవుతోంది.

ది డిప్లమాట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దగ్గర ఉన్నాయి. ఈ మూవీని మే 9వ తేదీన స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుందని సమాచారం బయటికి అయింది. అయితే, ఈ డేట్‍పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలీవుడ్ చిత్రాలు సాధారణంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. దీంతో ది డిప్లమాట్ కూడా మే 9న ఓటీటీలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే నెట్...