భారతదేశం, మే 6 -- క్రిస్టఫర్ అబాట్ లీడ్ రోల్ చేసిన ఉల్ఫ్ మ్యాన్ సినిమా ఈ ఏడాది జనవరి 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి లీ వానెల్ దర్శకత్వ వహించారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లనే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండియాలో ఉల్ఫ్ మ్యాన్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది.

ఉల్ఫ్ మ్యాన్ సినిమా మే 17వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలలకు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో కొన్ని ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఎలాంటి రెంట్ లేకుండా మే 17న జియో హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుంది. ఆ ఓటీటీ సబ్‍స్రైబర్లు ఫ్రీగా చూసేయవచ్చు.

ఉల్ఫ్ మ్యాన్ సినిమాను వానెల్ గ్రిప్పింగ్ నరేషన్‍తో డైరెక్టర్ వానెల్ తెరకెక్కించారు....