భారతదేశం, మే 17 -- హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా 'ఉల్ఫ్ మ్యాన్' మోస్తరు హిట్ సాధించింది. లీ వానెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రిస్టఫర్ అబాట్, జూలియా గార్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో వచ్చింది. అయితే, రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు నేడు (మే 17) ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

ఉల్ఫ్ మ్యాన్ సినిమా నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు హిందీ డబ్బింగ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది. రెండు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ఉల్ఫ్ మ్యాన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో సహా మరిన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో రెంటల్ పద్ధతిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది...