భారతదేశం, మే 20 -- తెలుగు హారర్ థ్రిల్లర్ 'భవానీ వార్డ్ 1997' సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో గణేశ్ రెడ్డి, పూజా కెండ్రే లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‍తో మిక్స్డ్ టాక్ వచ్చింది. పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ భవానీ వార్డ్ 1997 చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

భవానీ వార్డ్ 1997 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, రెంటల్ పద్ధతిలో ఈ మూవీ అడుగుపెట్టింది. ప్రస్తుతం రూ.99 రెంట్ చెల్లించి ఈ మూవీని ప్రైమ్ వీడియో చూసేలా అందుబాటులోకి వచ్చింది. తెలుగులో ఒక్కటే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

భవానీ వార్డ్ 1997 మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహించారు. లవ్, హారర్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. ఈ మూవీలో గణేశ్, పూజతో పాటు గాయత్రి గుప్తా, జబర్దస్...