భారతదేశం, జూన్ 2 -- తమిళ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' భారీ హిట్ కొట్టింది. శశికాంత్, సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‍బస్టర్ సాధించింది. ప్రేక్షకులను మనసులను గెలిచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీకి అభిషాన్ జీవినిత్ దర్శకత్వం వహించారు. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ సక్సెస్ సాధించింది.

టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు (జూన్ 2) ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి భారీ పాజిటివ్ బజ్ ఉండటంతో హాట్‍స్టార్ ఓటీటీలోనూ టూరిస్ట్ ఫ్యామిలీ దుమ్మురేప...