భారతదేశం, ఫిబ్రవరి 5 -- మలయాళం మూవీ.. అందులోనూ థ్రిల్లర్ జానర్లో వస్తుందంటే ఎలా ఉన్నా ఓ కన్నేస్తారు తెలుగు ప్రేక్షకులు. అంతలా అక్కడి థ్రిల్లర్ సినిమాలు మన వాళ్లను ఆకట్టుకున్నాయి. ఓ సింపుల్ కథను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అక్కడి దర్శకులు చూపించే విధానం బాగుంటుంది. అలాంటిదే మరో మెడికల్ థ్రిల్లర్ మూవీ బేబీ గర్ల్ ఓటీటీలోకి వస్తోంది.

ఈ మధ్యే సర్వం మాయ అనే హారర్ కామెడీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరైన మలయాళ నటుడు నివిన్ పాలీ. అతడు లీడ్ రోల్లో నటించిన సినిమానే ఈ బేబీ గర్ల్. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. 20 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఎక్స్ ద్వారా వెల్లడించింది.

"ఓ పాప్ మిస్సింగ్. అటెండెంట్ పారిపోవడం. నేరం కంటే దారుణమైన నిజం. నివిన్ పాలీ, లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ఈ హ...