భారతదేశం, జూన్ 15 -- బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించిన గ్రౌండ్ జీరో చిత్రం ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్‍స్కర్ దర్శకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ గ్రౌండ్ జీరో చిత్రం ఇప్పుడు ఓటీటీలోరెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

గ్రౌండ్ జీరో సినిమా జూన్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఈ చిత్రం ఓటీటీలోకి సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ఇటీవలే రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. అయితే, జూన్ 20న రెంట్ తొలగి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో ప్రైమ్...