Hyderabad, సెప్టెంబర్ 19 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ ఏడాది ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ తర్వాత హ్యాట్రిక్ సాధించిన మూవీ హృదయపూర్వం. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. వచ్చే వారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జానర్‌తో సంబంధం లేకుండా మోహన్‌లాల్ ఈ ఏడాది నటించిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టరే. గత నెలలో అతడు నటించిన హృదయపూర్వం రిలీజైంది. గత రెండు సినిమాల స్థాయిలో కాకపోయినా ఈ మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. ఇప్పుడీ మూవీ సెప్టెంబర్ 26 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (సెప్టెంబర్ 19) వెల్లడించింది. "ఇట్టు మీ జియోహాట్‌స్టార్.. సెప్టెంబర్ 26 నుంచి జియోహాట్‌స్టార్ లో హృదయపూర్వం స్ట్రీమింగ్ కానుంది" అనే క్య...