భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ ఫీల్ గుడ్ సినిమాగా గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మలయాళ మూవీ పేరు 'మిండియుమ్ పరంజుమ్' (Mindiyum Paranjum). ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల వివరాలు అధికారికంగా బయటికి వచ్చాయి.

థియేటర్లలో విడుదలైన సుమారు 40 రోజుల తర్వాత ఈ మిండియుమ్ పరంజుమ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) వేదికగా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మలయాళం నుంచి పెద్దగా ఇతర ఓటీటీ రిలీజ్‌లు లేకపోవడంతో.. ఈ వీకెండ్‌లో ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమాగా ఇది నిలుస్తుందని విశ్ల...