Hyderabad, మే 2 -- క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఓటీటీలోకి మరో వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు కంఖజూరా (Kankhajura). అంటే తెలుగులో మనం జెర్రీ అని పిలుస్తాం కదా అది. ఆ పురుగు పేరునే టైటిల్ గా పెట్టి తీసిన ఈ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (మే 2) రిలీజ్ చేశారు. వెరైటీ టైటిల్ కు తగినట్లుగానే ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది.

కంఖజురా వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. గతేడాది జనవరిలో ఈ కొత్త సిరీస్ ను అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. మొత్తానికి మే 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, మలయాళ స్టార్ నటుడు రోషన్ మాథ్యూలాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ మ్యాగ్‌పై (Magpie) ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. కంఖజురా అంటే జెర్రీ అనే పురుగు.

ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (మే 2) ప్రే...