భారతదేశం, ఫిబ్రవరి 5 -- కన్నడ ఓటీటీ కంటెంట్‌పై జీ5 (Zee5) ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా 'అయ్యన మానే', 'శోధ', 'మారిగల్లు' వంటి ఒరిజినల్స్‌ను విడుదల చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'రాక్షస'. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని జీ5 అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది.

జీ5 ఓటీటీ వరుసగా కన్నడ వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా రాక్షస పేరుతో మరొక సిరీస్ ను తీసుకొస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో 'చౌక', 'రాబర్ట్', ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ 'కాటేర' వంటి చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ తరుణ్ సుధీర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.

గతంలో వచ్చిన జీ5 వెబ్ సిరీస్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. తరుణ్ సుధీర్ నిర్మాణ...