భారతదేశం, ఏప్రిల్ 30 -- మలయాళ యాక్టర్లు మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రొమాన్స్' సినిమా మంచి హిట్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ అడ్వెంచర్ కామెడీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా జోరు చూపింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ బ్రొమాన్స్ మూవీ నేడే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

బొమాన్స్ సినిమా నేటి (ఏప్రిల్ 30) సాయంత్రం 5.30 గంటలకు సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రాన్ని మే 1న తీసుకురానున్నట్టు గతంలో సోనీలివ్ ప్రకటించింది. అయితే, ఒక రోజు ముందుగా నేడే సాయంత్రం ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.

బ్రొమాన్స్ సినిమా వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14...