భారతదేశం, ఏప్రిల్ 28 -- తమిళ యాక్టర్లు దుష్యంత్ జయప్రకాశ్, గాబ్రియెల్లా కార్ల్‌టన్ ప్రధాన పాత్రలు పోషించిన వరుణన్ చిత్రం ఈ ఏడాది మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి జయవేల్ మురుగన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్‍లో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ దక్కింది. ఈ వరుణన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

వరుణన్ సినిమా మే 1వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. మే 1 చాలా స్పెషల్, వరుణన్ సినిమా ప్రీమియర్ కానుంది అని సోషల్ మీడియాలో ఆహా తమిళ్ పోస్ట్ చేసింది.

వాటర్ సరఫరా చేసే రెండు గ్రూప్‍ల మధ్య గొడవలతో వరుణన్ మూవీ సాగుతుంది. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ మురుగున్. దుష్యంత్, గాబ్రియెల్లాతో పాటు రాధారవి, చరణ్ రాజ్, స...